Suhasini : ఆ సినిమాచూసే మణిరత్నంతో ప్రేమలో పడ్డ : సుహాసిని

టాలీవుడ్ తో పాటు తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని... టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్న తర్వాత టాలీవుడ్ కు దూరమైనప్పటికీ చిన్న పాత్రల్లో కనిపిస్తోంది. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా థగ్ లైఫ్. కమలహాసన్, శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సుహాసిని తాను మణిరత్నంతో ప్రేమలో పడటానికి గల కారణాలు వెల్లడించింది. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన నాయకన్ సినిమా చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడినట్లు చెప్పింది. అప్పటికీ ఆయన ఎవరో తనకు తెలియనప్పటికీ, ఆయనతో ప్రేమలో పడటానికి మాత్రం ఆ సినిమాయే కారణమట. 'ఆ సినిమా చేయకపోయి ఉంటే ఆయన లైఫ్ లో సుహాసిని లేదు. నాయకన్ చేశారు కాబట్టే ఆయన లైఫ్ లోకి నేను వెళ్లాను' అని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com