Kannada Actor : భార్య కొట్టినందుకే ఆత్మహత్య... కన్నడ నటుడి కేసులో కీలక విషయాలు...

ప్రముఖ కన్నడ బుల్లితెర హాస్యనటుడు చంద్రశేఖర్ సిద్ధి (28) గత నెల 31న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన తోనే సిద్ధి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. అయితే ఈ కేసుపై పోలీసులు చేసిన దర్యాప్తు లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.కుటుంబ సమస్యల వల్ల గత కొన్ని రోజులుగా చంద్రశేఖర్ సిద్ధి కి భార్యతో గొడవలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ గొడవ అవ్వగా...సిద్ధి భార్య అతనిని చీపురు కట్టతో కొట్టిందని...దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సిద్ధి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తు లో తేలింది.
2020లో కామెడి ఖిలాడీగాలు సీజన్ 3లో పాల్గొన్న చంద్రశేఖర్ సిద్ధి తక్కువ టైమ్ లోనే ఫేమస్ అయ్యాడు. తన కామెడీ టైమింగ్‌తో అందరిని అలరించిన సిద్ధి.. పలు టీవీ సీరియళ్లలోనూ నటించాడు. అయితే, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆందోళనకు లోనయ్యాడని, ఇల్లు గడిచేందుకు కష్టం అవ్వడంతో ఇటీవల దినసరి కూలీగా కూడా మారాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో యల్లాపుర తాలూకాలోని కట్టిగ అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడు నెలలుగా అతడు మానసిక ఆందోళనతో ఉన్నాడని, ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com