Game Changer Event Guest : గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు గెస్ట్‌గా సుకుమార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 21న USAలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025, జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో RC17 రూపొందనుంది. ఈ నేపథ్యంలో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరగబోతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగలేదు. జరగబోదు అనేంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com