Tollywood : సుకుమార్ ప్లాన్ ... ఆర్సీ 17లో సమంత?

మెగా హీరో రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో ఆర్సీ 16 షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు డిసైడ్ చేయలేదు. అయితే ఇదే తరుణంలో ఆర్సీ 17 కోసం కూడా ప్లాన్ జరుగుతోంది. బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫుల్ డై రెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీమ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిమీద మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. ఒక ఆప్షన్ గా సమంత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురి కాంబోలో రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. అందుకే సామ్ అయితే ఎలా ఉంటుందనే కోణంలో సుకుమార్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. కాకపోతే సమంత ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగి పోయింది. పుష్పలో ఐటెం సాంగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో సామ్ ముందం జలోనే ఉంది కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు. మరో ఆప్షన్ గా రష్మిక మందన్నని చూస్తున్నారట కానీ ఎంతమేరకు నిజమవుతుందో చెప్పలేం. ఇప్పటికైతే సుకుమార్ తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనక అక్టోబర్ లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సీ 17 సెట్స్ పైకి వెళ్తుందనే టాక్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com