Ramayana Movie : రామాయణం.. హనుమంతుడిగా సన్నీ డియోల్‌

Ramayana Movie : రామాయణం.. హనుమంతుడిగా సన్నీ డియోల్‌
X

బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యశ్‌ ఇందులో అధికారికంగా భాగమయ్యారు. తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈవిషయాన్ని తెలుపుతూ ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని సన్నీ హామీ ఇచ్చారు. ‘అవతార్‌’, ‘ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ తరహాలో రామాయణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు’ అని చెప్పారు. కాగా, ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Tags

Next Story