Sunny Leone : సన్నీ లియోన్ మందిర

Sunny Leone : సన్నీ లియోన్ మందిర
X

స్టార్ బ్యూటీ సన్నీ లియోన్ కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు చాలా కాలం తరువాత మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ సినిమాతో రాబోతోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆర్ యువన్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మందిర సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ప్రకటించారు మేకర్స్. నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లోకి రానుందని తెలిపారు. ఇక తెలుగులో సన్నీ లియోన్ కి ఉన్న మార్కెట్ కి అనుగుణంగా ఈ సినిమా విడుదలను ప్లాన్ చేశారట. మరి హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.

Tags

Next Story