Superstar Rajinikanth : చంద్రబాబు, మోదీకి థాంక్స్ చెప్పిన సూపర్ స్టార్ రజినీ కాంత్..

భారతీయ సినిమా చరిత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్థానం ప్రత్యేకమైనది. ఒక మాములు కండక్టర్ గా జీవితం ప్రారంభించిన ఆయన సూపర్ స్టార్ గా మారి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. కాగా నిన్నటితో సూపర్ స్టార్ తన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో రజినీ కాంత్ కు శుభాకాంక్షలు తెలియజేయగా... సూపర్ స్టార్ దానికి రిప్లై ఇచ్చారు.
"సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనే కాదు, ఆయన సినిమాలు కూడా సమాజంపై ప్రభావం చూపించాయి. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారు" అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇక దీనికి రిప్లై ఇచ్చిన సూపర్ స్టార్..."గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నా మనసును తాకాయి. నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. మీ ప్రేమ, మద్ధతులతో నేను ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాను. మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు " అని రజనీ కాంత్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
కాగా పీఎం మోడీ సైతం రజినీకాంత్ ను విష్ చేశారు. రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతమైంది. ఆయనే కాకుండా, ఆయన పోషించిన పాత్రలు కూడా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇటువంటి చరిత్రాత్మక సినీ జీవితం, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతున్నాను" అని మోడీ పేర్కొనగా...మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ రజనీకాంత్ థాంక్స్ చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com