I Bomma Ravi : సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవికి మద్దతు.. ఎందుకిలా..?

I Bomma Ravi : సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవికి మద్దతు.. ఎందుకిలా..?
X

ఐ బొమ్మ రవి అరెస్ట్ ను సినీ ఇండస్ట్రీ ప్రశంసిస్తోంది. పోలీసులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ సోషల్ మీడియా మొత్తం రవికే సపోర్ట్ చేస్తోంది. రవి కోసం చాలా మంది పాజిటివ్ గా వందల పోస్టులు, వేల కామెంట్లు, లక్షల్లో లైకులు కొడుతున్నారు. రవిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని సోషల్ మీడియాలో పోల్ పెడితే.. 100 పర్సెంట్ రవి అరెస్ట్ కరెక్ట్ కాదంటున్నారు. రవి మా హీరో.. మా పాలిట దేవుడు అని కూడా అంటున్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నోళ్లను విడిచిపెట్టి ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటున్నారు. ప్రజల నుంచి ఇలాంటి రెస్పాన్స్ బహుషా సినిమా వాళ్లు ఊహించి ఉండరేమో. రవి చేసింది తప్పా.. కాదా అంటే కచ్చితంగా తప్పే.

కానీ రవికి ఎందుకింత మద్దతు వస్తోందని కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకప్పుడు సినిమా టికెట్ రూ.50 ఉంటే.. ఇప్పుడు రూ.500, వెయ్యి రూపాయలు ఇలా ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో నలుగురు సినిమాకెళ్తే రూ.2వేలు అయిపోతున్నాయి. థియేటర్ కు వెళ్లాక పాప్ కార్న్, సమోసాలు, కూల్ డ్రింక్స్ కొనకుండా ఉంటామా.. వాటికి ఇంకో వెయ్యి కంటే ఎక్కువే ఖర్చు అవుతోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లు వేలు పెట్టి సినిమాలు చూసే పరిస్థితి లేదు. కాబట్టి జేబులకు చిల్లు పడుతోంది.

అందుకే ఐ బొమ్మకు ఇన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక మిడిలి క్లాస్ ఫ్యామిలీ వేలకు వేలు పెట్టి సినిమాలు చూసే సిచ్యువేషన్ లేదు కాబట్టే ఇలాంటి పైరసీని ప్రజలు ఎంకరేజ్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఇంట్లో హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు రవికి ఇంతమంది సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు. కానీ రవి చేసింది మాత్రం ముమ్మాటికే తప్పే. అలా అని సినిమా వాళ్లు కూడా ఒకసారి టికెట్ రేట్ల విషయంలో ఆలోచిస్తే బెటర్ అంటున్నారు.

Tags

Next Story