Actor Surya : డైరెక్ట్ తెలుగు సినిమాకు సూర్య గ్రీన్‌సిగ్నల్?

Actor Surya : డైరెక్ట్ తెలుగు సినిమాకు సూర్య గ్రీన్‌సిగ్నల్?
X

తెలుగులోనూ స్టార్‌డమ్ ఉన్న నటుల్లో తమిళ హీరో సూర్య ఒకరు. అయితే ఇప్పటివరకు స్ట్రెయిట్‌గా టాలీవుడ్ చిత్రంలో నటించలేదు. తాజాగా ఆయన తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పిన కథ సూర్యను ఇంప్రెస్ చేసిందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తోంది. ఆమె తొలి సినిమా మిస్టర్ బచ్చన్ అరివీర భయంకర డిజాస్టర్ అయింది. అలాంటి దారుణ ఫ్లాప్ ఈ మధ్య కాలంలో లేదు. కానీ భాగ్యశ్రీ అంటే టాలీవుడ్ మాత్రం బాగా ఇష్టపడుతోంది. చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మాత్రం సూర్య ఏకంగా ఇద్దరు తెలుగు దర్శకులతో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా గీత ఆర్ట్స్ బ్యానర్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ కాంబోలో మూవీ కన్ఫామ్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు ఆ వార్త వైరల్ అవుతుంది.

Tags

Next Story