Sushant Singh Rajput Family Accident: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి యాక్సిడెంట్.. ఒకేసారి అయిదుగురు..

Sushant Singh Rajput Family Accident: బాలీవుడ్‌లో కలకలం రేపిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయాన్ని ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని.. అది హత్య అని ఇప్పటికీ ఎంతోమంది గట్టిగా నమ్ముతున్నారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని కొన్నాళ్లు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు జరిపినా లాభం లేకుండా పోయింది. సుశాంత్ మరణం గురించి మర్చిపోకముందే తన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
సుశాంత్ బావ బీవీ సింగ్ సోదరి ఇటీవల మరణించింది. ఆమె అంత్యక్రియల కోసం సుశాంత్ కుటుంబీకులు కార్‌లో బయలుదేరారు. ఆ కార్ సికింద్రా, శేఖ్‌పురా నేషనల్ హైవే దగ్గరకు రాగానే ఒక ట్రక్కు వెనకనుండి వచ్చి దానిని ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం పదిమంది ఉండగా.. అందులో ఆరుగురు మరణించినట్టు సమాచారం.
మరణించిన ఆరుగురిలో ఐదుగురు సుశాంత్ కుటుంబీకులు అని పోలీసులు చెప్తున్నారు. మృతులు లాల్‌జీత్ సింగ్, నేమని, రామ్‌చంద్ర, బేబీదేవి, అనితాదేవితో పాటు డ్రైవర్ ప్రీతమ్ కుమార్‌గా గుర్తించారు. గ్యాస్ సిలిండర్లతో వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు అంతా నుజ్జునుజ్జయ్యింది. తీవ్ర గాయాలపాలైన నలుగురిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com