Tollywood : చైతూ పక్కన సుశాంత్ భామ

టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా సెట్స్ పై బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే వి రూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తదుపరి సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ 11న హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు సమాచారం. కాంబో సెట్టయితే చైతన్య, మీనాక్షి కలిసి పనిచేసే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇటీవల లక్కీ భాస్కర్ తో మీనాక్షి బిగ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె నటించిన మట్కా కూడా ఇటీవల విడుదలైనా పెద్దగా క్లిక్ కా లేకపోయింది. మీనాక్షి ప్రస్తుతం మెకానిక్ రాకీతో పాటు వెంకటేశ్ నటిస్తున్న సంక్రాం తికి వస్తున్నాం సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే ఇందులో పూజా హెగ్దే కూడా నటిస్తూ ఉండడంతో ఈమె సీనియర్ హీరోయిన్ ని డామినేట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com