Taapsee : సీక్రెట్ రివీల్ చేసిన తాప్సీ

Taapsee : సీక్రెట్ రివీల్ చేసిన తాప్సీ
X

నటి తాప్సీ పన్ను తన పర్సనల్ లైఫ్ జరిగిన ఓ సీక్రెట్ ను రివీల్ చేశారు. తాజాగా ముంబైలోని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. 'అందరూ అనుకుంటున్నట్టు నా పెండ్లి ఈ ఏడాదిలో జరగలేదు. గత డిసెంబర్ లోనే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నం. త్వరలోనే త్వరలోనే మా వెడ్డింగ్్యనివర్సీ రానుంది. ఈ విషయాన్ని నేను బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి తెలిసేది కాదు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లకు సంబంధించి సరైన బ్యాలెన్స్ ఉండాలని మేం అనుకున్నం. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేస్తే వృత్తిపరమైన విషయాలకు అది ఆటంకంగా మారుతుందని భావించాం. డిసెంబర్లో వివాహం తర్వాత ఆత్మీయులు, సన్నిహితుల కోసం ఈ ఏడాది మార్చి 23న ఉదయ్ పుర్ సంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకున్నం. ఆత్మీయులను మాత్రమే ఆహ్వానించాం. అంతేకానీ దాని గురించి బహిరంగ ప్రకటన చేయలేదు. దక్షిణాది నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో పరిచయం ఏర్పడిందని, నాటి నుంచి ఆ బంధం కొనసాగుతోంది' అని తాప్సీ పేర్కొన్నారు.

Tags

Next Story