Nidhhi Agerwal : రీల్ చాలెంజ్ స్వీకరించండి... నిధి అగర్వాల్ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరి హర వీరమల్లు'. దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నాడు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని రెండో సింగిల్ సాంగ్ 'కొల్లగొట్టినాదిరో కూడా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ మెలోడీ గా వచ్చిన ఈ పాటలో పవన్ తనదైన వింటేజ్ స్టెప్పు లతో ఇరగదీశాడు. ఇక అందాల ముద్దు గుమ్మ నిధి అగర్వాల్ ఈ సాంగ్లో చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది. కాగా.. తాజాగా నిధి ఈ పాటకి రీల్ చేసి నెటిజన్లకు కూడా చాలెంజ్ విసిరింది. 'కొల్లగొట్టినాదిరో హుక్ స్టెప్ వేయడం నాకు చాలా నచ్చింది. మరి ఇప్పుడు మీ వంతు వచ్చింది. నా రీల్ ఛాలెంజ్ ని స్వీకరించండి. మీ డ్యాన్స్ మూమెంట్స్ ను మాకు చూపించండి!' అంటూ సోషల్ మీడియాతో పోస్ట్ చేసింది. మరి ఈ బ్యూటీ విసిరిన ఈ ఛాలెంజ్ ను నెటిజన్లు ఎలా స్వీక రిస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com