Tamannaah and Vijay Varmas : ఏమిటీ విడిపోలేదా.. తమన్నా, విజయ్ సర్ ప్రైజ్!

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆమె ప్రియుడు విజయ్ వర్మ మధ్య బ్రేకప్ అయినట్టు వార్తలొస్తున్న సమయంలో వీళ్లి ద్దరూ ఒకే చోట ప్రత్యక్షమవడం ట్రెండింగ్ గా మారింది. బ్రేకప్ సంగతిని వీళ్లిద్దరిలో ఎవరు కూడా అధికారికం గా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే చోట కనిపించారు. కాకపోతే వేర్వేరుగానే... హోలీ సం దర్భంగా నటి రవీనా టాండన్ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్ ఇంటికి వేర్వేరుగా వచ్చారు. ఇక అక్కడి నుంచి వైరల్ అవుతున్న వీడియోలో, రవీనా ఇంటికి వెళ్ళే ముందు, విజయ్ వర్మ అక్కడ ఉన్న కెమెరా మెత్తో హోలీ ఆడుతున్నట్లుగా ఉంది. అదే విధంగా అక్కడే తమన్నా భాటియా కూడా మీడియాలో గట్టిగానే ఫోకస్ అయింది. వారిద్దరూ వేర్వేరు సమయాల్లో రవీనా టాండన్ ఇంట్లో ఏర్పాటు చేసిన హోలీ పార్టీకి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి కనిపించలేదు. వా ళ్లిద్దరూ రవీనా టాండన్ ఇంట్లో కలిశారా.. ? లేదా..? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా రా..? హోలీ ఆడుకున్నారా లేదా..? అనే అంశంపై ఎలాంటి సమాచారం లేదు. రవీనా టాండన్ ఇంట్లో వీళ్లిద్దరూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com