Tamannaah : ప్రపోజ్ చేస్తే చెల్లి అన్నాడు

Tamannaah : ప్రపోజ్ చేస్తే చెల్లి అన్నాడు
X

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు టాప్ స్టార్స్ తో చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఆమె నటుడు వినయ్ వర్మను పెళ్లి చేసుకుందుకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే తాజాగా తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది తమన్నా. నేను నా స్కూల్ డేస్ లోనే ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేశాను. తను నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. కొంతకాలం తరువాత ధైర్యం చేసిన నా ప్రేమ విషయాన్ని తనకి చెప్పాను. కానీ, నేను తన చెల్లి ఫ్రెండ్ అవడంతో నన్ను కూడా చెల్లిగానే ట్రేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఆమాట వినగానే నేను షాకయ్యాను. అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను" అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story