విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమం..

Tamil Nadu: డీఎండీకే అధినేత, సినీనటుడు కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉంది. గత కొంత కాలంగా విజయ్‌కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అమెరికా, సింగపూర్‌లలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. విజయకాంత్ కొవిడ్ సెకండ్ వేవ్‌లో వైరస్ సోకింది. కొవిడ్ నుంచి కోలుకున్నా..ఆయన ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. విజయ్‌కాంత్ పార్టీ బాధ్యతలను కూడా తన భార్యకు అప్పగించారు. తాజాగా ఆరోగ్యం మళ్లీ విషమించడంతో విదేశాలకు ప్రయాణమయ్యారని తెలిసింది. చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయన వెళుతున్న దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లండన్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు దుబాయ్‌లో చికిత్స చేస్తారని సమాచారం. అయితే విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో అందోళన నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com