Tandell Movie : బుజ్జితల్లి సాంగ్ న్యూ రికార్డ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయిపల్లవి కాంబోలో తెరకెక్కు తున్న లేటెస్ట్ మూవీ తండేల్. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మత్స్యకార కుటుంబాల అంశంతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్టు సమాచారం. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సినిమాను సమర్పిస్తున్నా రు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. తాజాగా ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com