Tandell Movie : తండేల్ సినిమాకు యు/ఎ సర్టి ఫికెట్ .. నిడివి ఎంతంటే

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేట్రికల్ గా విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ పూర్త యింది. ఈ మూవీకి యు/ఎ సర్టి ఫికెట్ వచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 32 నిమిషాలకు ఫిక్సయిం ది. చందూ మొండేటి దర్శకత్వంలో రూ పుదిద్దుకుంటోన్న చిత్రం 'తండేల్'. 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్లో 'తండేల్' ఒకటి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వర పరిచిన 'బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా' పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్ లో, అలాగే యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కూ మంచి స్పందన వచ్చింది. యాక్షన్ సీన్స్ తో పాటు దేశభక్తి కూడిన సన్నివేశాలు నార్త్ ఆడియెన్స్ ని ఆకర్షించడంలో కీలక పోషించనున్నాయి. 'తండేల్' మేకర్స్ ఈ సినిమా హిందీ ట్రైలర్ ని ఇవాళ అమీర్ ఖాన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. మరి రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా చైతన్య కెరీర్ లో ఎంతో కీలకంగా మారనుంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డా డు. శ్రీకాకుళం యాస, భాష కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిది హిట్ పెయిర్. లవ్ స్టోరీ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఇప్పుడు తండేల్ ట్రైల ర్ లో మరోసారి ఈ జోడీ సూపర్ అని అనిపించింది. ట్రైలర్. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ కూడా ఛార్ట్ బస్టర్ గా నిలిచాయి. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ 24 గంటల్లో 9.47 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుంది. ఇప్పుడు కూడా అదే జోష్ లో సందడి చేస్తోంది. కరెక్ట్ టైమ్ లో ట్రైలర్ రిలీజ్ చేశారని, సరైన రీతిలో మేకర్స్ కట్ చేశారని కొనియాడుతు న్నారు. దీని బట్టి తండేల్ మేకర్స్.. ప్రమోషన్స్ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com