Tandell Pre-Release Event: తండేల్’ ప్రీరిలీజ్ వేడుక వాయిదా?

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగాల్సిన ఈ వేడుక అనివార్య కారణాలతో వాయిదా పడిందని సినీవర్గాలు తెలిపాయి. నాలుగో తేదీన నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
ప్రేమమ్, సవ్యసాచి తర్వాత నాగచైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్య్సకారుల జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది.
విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన టీమ్.. నేడు ముంబయిలో హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నైలో గురువారం నిర్వహించిన వేడుకలో తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com