Tarakaratna : తారకరత్నకు కడసారి చూపు

Tarakaratna :  తారకరత్నకు కడసారి చూపు
మోకిలలోని తారకరత్న ఇంటికి సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు. తారకరత్నను కడసారి చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు

తారకరత్న మృతితో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. మోకిలలోని తారకరత్న ఇంటికి సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు. తారకరత్నను కడసారి చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తారకరత్న తుదిశ్వాస విడిచారు. అంబులెన్స్ లో బెంగళూరు నుంచి మోకిలలోని ఆయన నివాసానికి పార్ధివదేహాన్ని తరలించారు.

ఇక రేపు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్ధివదేహం తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం రేపు ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయం ఉంచనున్నారు. రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్ర 4గంటల వరకు తారకరత్న పార్ధివదేహం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సాయంత్రం ఫిల్మ్ నగర్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story