TarakaRatna Health Update: ఐసీయూలోనే నందమూరి తారకరత్న

సినీనటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఇప్పటికీ ఐసీయూలోనే తారకరత్నకు వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. నిన్న తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేయకపోయే సరికి నందమూరి అభిమానులు టెన్షన్ కు గురయ్యారు. ఈరోజు వైద్య పరీక్షల అనంతరం తారకరత్న హెల్త్ బులిటెన్ ను డాక్టర్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబు డాక్టర్లను కలిసి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నారు. తారకరత్న బాబాయ్ హీరో నందమూరి బాలకృష్ణ నిరంతరం హాస్పిటల్ దగ్గరే ఉండి బాగోగులు చూసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా హాస్పిటల్ ను సందర్శించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని, తిరిగి ఇంటికి రావాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com