Suma Kanakala: యాంకర్ సుమ సినిమాపై టీడీపీ ఎంపీ కామెంట్స్..

Suma Kanakala: సుమ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయిన యాంకర్. అందుకే యాంకర్ సుమ అనేది ఓ పేరు కాకుండా ఓ బ్రాండ్‌లాగా మారిపోయింది. అయితే సుమ ఓవైపు యాంకర్‌గా బిజీగా ఉంటూనే.. లీడ్ రోల్‌లో 'జయమ్మ పంచాయతీ' అనే సినిమాలో నటించింది. ఇటీవల జయమ్మ పంచాయతీ ట్రైలర్ విడుదలయ్యింది. దానిపై టీడీపీ ఎంపీ ఒకరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రాజకీయ నాయకులు ఇంతకు ముందు కేవలం రాజకీయ విషయాలపైనే స్పందించేవారు. సినిమాల గురించి పెద్దగా ఎలాంటి కామెంట్స్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక సినిమా విడుదలయ్యి అది మంచి టాక్ సంపాదించుకుంది అంటే దానిపై రాజకీయ నాయకులు కూడా స్పందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే తాజాగా సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం యాసతో సినిమాలు రూపొందించడం తనకు ఎంతో గర్వంగా ఉంది అన్నారు. మన భాష, సంస్కృతి చూపించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అని సోషల్ మీడియా ద్వారా తన కోరికను బయటపెట్టారు. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన జయమ్మ పంచాయతీలో యాంకర్ సుమ మినహా దాదాపు అందరూ కొత్త నటీనటులే కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com