Pushpa 2 : పుష్ప2 సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Pushpa 2 : పుష్ప2 సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

పుష్ప2 సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 04వ తేదీ రాత్రి 9 : 30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటుగా అర్థరాత్రి 01 గంట వరకు అనుమతి ఇచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా సింగిల్ స్క్రీన్ తో పాటుగా మల్టీఫ్లెక్స్‌ల్లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. ఇక రిలీజ్ రోజు నుంచి అంటే డిసెంబర్ 05వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపునకు పర్మిషన్‌ ఇచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

Tags

Next Story