Samyukta Menon : తెలుగు ఆడియన్స్ గ్రేట్ : సంయుక్త మీనన్

Samyukta Menon : తెలుగు ఆడియన్స్ గ్రేట్ : సంయుక్త మీనన్
X

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందరూ సక్సెస్ ను అందుకోలేరు. అలాగే స్టార్ గా మారలేరు. కానీ అలా స్టార్ హీరోయిన్ గా మారిన వారిలో సంయుక్త మీనన్ ఒకరు. భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ బ్యూటీ. అందులో రానాకు భార్యగా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత సార్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ సాధించింది. తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్, బింబిసారా వంటి వరుస ఆఫర్లతో బిజిబిజీగా మారిపోయింది. ఇక విరూపాక్ష సినిమాలో హీరోయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే సంయుక్త మలయాళం అమ్మాయి అయినా తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతుం ది. రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన బచ్చలపల్లి సినిమా ఈవెంట్ కు వెళ్లింది. అక్కడ తెలుగు ఆడియన్స్ గ్రేట్ అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తింది.

Tags

Next Story