Telugu Heroine : బాలీవుడ్‌లోకి తెలుగు హీరోయిన్ ఎంట్రీ!

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ రాకేశ్ జగ్గి దర్శకత్వంలో నటిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ రోల్‌లో కనిపించనుండగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని సమాచారం. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనన్య స్మాల్ స్కేల్ వుమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. 'తంత్ర' 'పొట్టేల్' 'బహిష్కరణ' 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్‌లో టాప్ -2 లో ట్రెండ్ అవుతుండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్- 5లో ట్రెండింగ్‌లో ఉంది. ఇకపై దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ల బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. ఆమె మెయిన్ రోల్‌లో ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com