Prabhas : రాజా సాబ్ లో రీమిక్స్ సాంగ్ ఎవరిదై ఉంటుంది..?

ప్యాన్ ఇండియా టాప్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే మరో రెండేళ్ల వరకూ బాక్సాఫీస్ ను ఊచకోత కోయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ సమ్మర్ లో రాజా సాబ్ వస్తోంది. తర్వాత హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ తో పాటు సలార్ 2 ఉంటుంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న రాజా సాబ్ లో నిధి అగర్వాల్, మాళవి మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మారుతి మార్క్ హారర్ కామెడీ మూవీ. ఈ జానర్ లో నటించడం ప్రభాస్ కు ఇదే ఫస్ట్ టైమ్.
లేటెస్ట్ గా థమన్ బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ కు సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకున్నాడు. అందులో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం రీమిక్స్ సాంగ్. కొన్నాళ్ల క్రితం రీమిక్స్ సాంగ్స్ అనేది ఓ ట్రెండ్ లా కనిపించింది. ముఖ్యంగా చిరంజీవి పాటలను ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా వాడారు. అలాగే పెద్దాయన ఎన్టీఆర్ పాటలను తారక్, బాలయ్య పాటలను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేశారు. బట్ ఒరిజినల్ లోని ఫీల్ ను రీ క్రియేట్ చేయడంలో వీళ్లంతా ఫెయిల్ అయ్యారు. దీంతో ఫ్యాన్సే రీ మిక్స్ లు వద్దు బాబోయ్ అన్నారు.
అయితే రాజా సాబ్ లో ప్రభాస్ కోసం ఓ రీమిక్స్ సాంగ్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇది కాక సినిమాలో ఇంకా ఆరు పాటలు ఉంటాయి అంటున్నాడు. అయితే ప్రభాస్ ఎవరి సాంగ్ ను రీ మిక్స్ చేయబోతున్నాడు అనే చర్చలు సాగుతున్నాయి. చేస్తే ఖచ్చితంగా కృష్ణంరాజు పాటలే చేయాలి. మరి రాజా సాబ్ లాంటి హారర్ మూవీలో కృష్ణంరాజు పాటంటే మంచి రొమాంటిక్ డ్యూయొట్ అయ్యి ఉండాలి. అఫ్ కోర్స్ కృష్ణంరాజు మూవీస్ లో అద్భుతమైన మెలోడీస్ కూడా ఉన్నాయి. మరి అవే రీ మిక్స్ చేస్తారా లేక ఇంకేదైనా ఛాయిస్ తీసుకుంటారా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com