Mamitha Baiju : ఆ డైరెక్టర్ కొట్టడానికి చెయ్యి ఎత్తాడు : మమిత బైజు

ప్రేమలు మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ప్రేమలు మూవీ హీరోయిన్ మమిత బైజు. ఈ మూవీకి మంచి సక్సెస్ వచ్చింది. దీంతో ఈ అమ్మడికి బాగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస ఆఫర్లను పట్టేందుకు రెడీగా ఉంది. కోలీవుడ్ మాత్రం తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ను ఓకే చేస్తుందట ఈ మలయాళీ బ్యూటీ. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ మమిత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. తనను డైరెక్టర్ కొట్టినట్టు చెప్పింది. దీంతో బాల వనంగాన్ మూవీ డైరెక్టర్ బాలా ఆమెను కొట్టారని, టార్చర్ చేశారని రూమర్స్ పాకాయి. దీనిపై మమిత క్లారిటీ ఇచ్చారు. పూర్తి విషయం తెలుసుకోకుండా మాట్లాడవద్దని, -పూర్తిగా తెలుసుకుంటే అందరికీ ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చింది. అయినా ప్రచారం ఆగలేదు. మేకప్ విషయంలో సరదాగా జరిగిన విషయాన్ని ఇలా రచ్చచేశారని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హల్ చల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com