Rakul Preet Singh : ఆ గాయం నాకో ఎదురుదెబ్బ : రకుల్

Rakul Preet Singh : ఆ గాయం నాకో ఎదురుదెబ్బ : రకుల్
X

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. 'ఇండియన్ 3', 'దే దే ప్యార్ దే 2'లో నటిస్తూ.. ప్రచార కార్యక్రమా ల్లోనూ బిజీగా ఉంది. అయితే గతేడాది అక్టోబర్ లో జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఆమెకు గాయమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎన్నో సందర్భాల్లో అభిమానులతో పంచుకుంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో రకుల్ హెల్త్ పై అప్డేడేట్ ఇచ్చింది. 'జిమ్లో గాయం నాకో ఎదురుదెబ్బ. నేను ఇప్పుడు కొద్దికొద్దిగా కోలుకుంటున్న, కానీ గాయం నుంచి పూర్తిగా బయటపడలేదు. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్న. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయని అనుకున్న. ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశాను. చికిత్స తీసు కోవాలని నిర్ణయించుకునే టైంకే దాని తీవ్రత ఎక్కువైంది. దీని నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుంది.గాయం నాకు ఎన్నో విషయాలు నేర్పింది. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవడం ముఖ్యం. నేను చేసిన తప్పును ఇతరులు చేయొద్దు' అని పేర్కొంది. ఇక, రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు, హిందీ నిర్మాత జాకీ భగ్నానీతో వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తర్వాత హనీమూన్ ఫోటోలు పంచుకుని మళ్లీ తన రొటీన్‌లోకి మునిగిపోయింది.

Tags

Next Story