Trisha : అదే నా కోరిక.. అసలు విషయం బయటపెట్టిన త్రిష

Trisha : అదే నా కోరిక.. అసలు విషయం బయటపెట్టిన త్రిష
X

రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష. 40 ఏండ్ల వయస్సులోనూ అందం, అభినయంతో యువనటీమణులకు గట్టిపోటీని ఇస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఆమె.. ఇప్పుడు పాస్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజా సేవ చేయాలని ఉందంటూ రాజకీయాలపై తన ఇష్టాన్ని బయటపెట్టారు. కాగా.. ఈమె వ్యాఖ్య లు సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీ యాంశంగా మారాయి. మరోవైపు తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా పనిచే సిన విషయం తెలిసిందే. ఇక 2025లో ఏకంగా త్రిష నటించిన 6 సినిమాలు విడుదలకానున్నాయి. ఇవన్నీ కూడా స్టార్ హీరోల మూవీలే. అజిత్ నటిస్తున్న విదాముయార్చి, గుడ్ బాడ్ అగ్లీలో ఆమెదే మెయిన్ రోల్. కమల హాసన్ హీరోగా వస్తున్న థగ్ లైఫ్, సూర్య 45 సినిమాలోనూ ఆమె యాక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర, మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరో ఐడెంటిటీ అనే సిని మాలోనూ త్రిష నటిస్తున్నారు.

Tags

Next Story