Megha Akash : అది చాలా కష్టం... మేఘా ఆకాష్ ఆసక్తికర పోస్టు

నితిన్ 'లై' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మేఘా ఆకాష్. ఆ తర్వాత చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, డియర్ మేఘా వంటి తెలుగు చి త్రాల్లో నటించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. తెలుగుతోపాటు తమిళంలో పెట్టా, ఎనై నోక్కి పాయుమ్ తోట, హిందీలో సాటిలైట్ శంకర్ మూవీల్లోనూ అలరించింది. ఇటీవల 'వికటకవి' వెబ్ సిరీస్లో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. బట్ అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈవయ్యారికి.. సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్ల క్రితమే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మేఘా.. ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అటు పర్సనల్ లైఫ్.. ఇటు సినీ జీవితాన్ని లీడ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడి యాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా మేఘా అబుదాదిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో దిగిన పిక్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈఫొటోలకు 'ఎడారి మ్యాజిక్ ని వర్ణించడం చాలా కష్టం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com