Vijayashanti : అదే రోషం .. వయసొచ్చినా తగ్గేదే లే

Vijayashanti : అదే రోషం .. వయసొచ్చినా తగ్గేదే లే
X

కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. విజయశాంతి, సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయశాంతి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ఈ స్టోరీ వినగానే ఏదో తెలియని అనుభూతి. తప్ప కుండా చేయాలనిపించింది. కల్యాణ్మ్.. అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నరు. సినిమా పూర్తైపోయింది. ఇకపై మీ అందరినీ మిస్ అవుతుంటా. వీలున్నప్పుడల్లా మనం కలుద్దాం. ఈ సినిమాను ఆదరించాల్సిన బాధ్యత ఇక మీ చేతుల్లోనే ఉంది. ఇందులో నేను యాక్షన్ సీన్స్ కూడా చేశా. నా ఫ్యాన్స్ కు తప్పకుండా నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ అని చెప్పగానే కాస్త చాలెంజింగ్ గా అనిపిం చింది. షూట్ రోజు సెట్లో ఉన్న వాళ్లందరూ ఎంతో కంగారుపడ్డారు. కానీ, తొలి షాట్లోనే సీన్ పూర్తిచేశా. అందరూ షాక్ అయ్యారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం.. అదే రోషం.. తగ్గేదే లే. ఎంత వయసు వచ్చినా అంతే స్ట్రాంగ్, క్రమశిక్షణతో ఉంటా. నా పేరెంట్స్ వల్లే మీ అందరి ఆశీస్సు లు పొంది ఈ స్థాయికి వచ్చా' అని విజయశాం తి చెప్పారు.

Tags

Next Story