Nara Rohit : అది నిజమే.. అసలు విషయాన్ని బయటపెట్టిన నారా రోహిత్

Nara Rohit : అది నిజమే.. అసలు విషయాన్ని బయటపెట్టిన నారా రోహిత్
X

అది నిజమే ఏపీ రాజకీయాల్లో బిజీగా గడువుతోన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అప్పటికే ఒప్పుకున్న సినిమాలు అయినప్పటికీ ఎన్నికల ముందు ప్రచారంలో బిజీ, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టడంతో ఆయన నటించాల్సిన ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు ఎప్పటిలోగా వస్తాయనే విషయం అప్పట్లో కచ్చితంగా చెప్పలే కపోయారు. తాను ఒప్పుకున్న సినిమాలకు టైం ఇచ్చేందుకు పవన్ అంగీకరించడంతో ప్రస్తుతం ఓజీ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోం ది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నా డు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా , ఇమ్రాన్ హష్మీ విలన గా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇందులో నారా రోహిత్ కు కాబోయే సతీమతి శిరీషా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. భైరవం సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నారా రోహిత్ ఆ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. ఓజీలో ఓ కీలక సన్నివేశంలో తనకు కాబోయే భార్యకు నటించే అవకాశం దక్కిందని చెప్పాడు.

Tags

Next Story