12th Fail : 12త్ ఫెయిల్ మరో సంచలనం

12th Fail : 12త్ ఫెయిల్ మరో సంచలనం
X

2023 అక్టోబర్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బాలీవుడ్ చిన్న సినిమా '12త్ ఫెయిల్' (12th Fail) భారీ సక్సెస్ అందుకుంది. దీనికి సంబంధించిన మరొక సంచలనం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 30 కోట్ల పెట్టుబడితో తీసిన ఈసినిమాకు 100 కోట్ల నెట్ కలక్షన్స్ రావడం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఐఎండిబి ప్రకటించిన 250 స్థానాలలో ఈసినిమాకు 50 స్థానం దక్కడంతో పాటు మరే భారతీయ సినిమాకు ఈ ర్యాంకింగ్స్ లో స్థానం దక్కకపోవడంతో ఈమూవీ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు విధు వినోద్ చోప్రా తాను ఇక చనిపోయినా ఫర్వాలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటే ఆసినిమా పట్ల ఆ దర్శకుడుకి ఎలాంటి నమ్మకం ఉందో అర్థం అవుతుంది.

విధు వినోద్ చోప్రా భార్య ప్రముఖ క్రిటిక్ అనుపమా చోప్రా ఈ మూవీ ఫస్ట్ కాపీని రిలీజ్ కు ముందే చూసింది. ఈ సినిమాను ఎవరూ చూడరని అందువల్ల ఓటీటీకి ఇచ్చేయమని చెప్పినప్పటికీ దర్శకుడు సాహసంతో ఆసినిమాను ధియేటర్లలో గత సంవత్సరం విడుదలచేసి ఘన విజయం సాధించాడు. డిస్ట్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న మూవీకి మిలియన్స్ లో వ్యూస్ వస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈమూవీని తెలుగులో డబ్ చేయాలా లేదంటే ఎవరైనా యంగ్ హీరోతో రీమేక్ చేయాలా అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్.

Tags

Next Story