Raashi Khanna : అందాల రాశి... చీరకట్టులో, పాపట బిల్ల పెట్టుకుని

'ఊహలు గుసగుసలాడే'తో టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆతర్వాత జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, ఆక్సీజన్, టచ్ చేసి చూడు ఇలా వరుసగా పెద్ద సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒకానొక టైంలో కాస్త బరువు ఎక్కువగా ఉన్న రాశీ.. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం, ఆఫర్ల కోసం సన్నబడింది. బరువు తగ్గి, సన్నగా నాజూకుగా కనిపించడం ద్వారా టాలీవుడ్లో మరిన్ని సినిమాలను ఈ అమ్మడు సొంతం చేసుకుంది. ఇటీవలే రిలీజైన హారర్ థ్రిల్లర్ ఫాంటసీ మూవీ 'అగత్య'లోనూ నటనతో ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల కంటే హిందీ, తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ అందాల రాశీ చేతిలో సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా', టిఎంఇ (విక్రాంత్ మాస్సే) అనే హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. అయితే మూవీ చాన్సులు ఉన్నా రెగ్యులర్గా అందమైన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా మరోసారి తన క్యూట్, అందమైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చీరకట్టులో, పాపట బిల్ల పెట్టుకుని, సింపుల్ హెయిర్ స్టెల్తో, చేతికి గాజులు ధరించి ట్రెడిషనల్ లుక్తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది. పికే షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ను దక్కించుకుంది. రాశీ బ్యూటికి ఫ్యాన్స్ లవ్ ఈమోజీలు షేర్ చేస్తూ తమ అభిమానం పంచుకుంటున్నారు. ఇంత అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com