Bollywood : బాలీవుడ్లో బెంగళూరు భామల హవా

Bollywood : బాలీవుడ్లో బెంగళూరు భామల హవా
X

బాలీవుడ్ లో బెంగళూరు భామల హవా నడుస్తోంది. వాళ్లెవరో కాదు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ఇద్దరు కన్నడ భామలు ఇప్పుడు బాలీవుడ్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలీవుడ్ లో టాప్ 5 లిస్ట్ తీస్తే దీపికా పదుకొణే తప్పక ఉంటుంది. ఐశ్వర్యా రాయ్ రేర్ గా సినిమాలు చేయడం, ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోవడంతో దీపిక మరింత షైన్ అయ్యింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, అలియా భట్ లాంటి భామలున్నా? వాళ్లను మించిన క్రేజీ బ్యూటీగా దీపికకు పేరుంది. రష్మిక 'పుష్ప 'తో పాన్ ఇండియాలో వెలుగులోకి వచ్చింది. అటుపై రిలీజ్ అయిన 'యానిమల్' తో మరింత ఫేమస్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన 'పుష్ప2' తో ఆ క్రేజ్ రెట్టింపు అయింది. స్టార్ హీరోలే రష్మికతో నటిం చడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మూడేండ్ల క్రితం గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లాంచ్ అయిన రష్మిక.. సోలోగానే తన సత్తా చాటులోంది. తాజాగా 'ఛావా 'లోనూ నటించింది. శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో ఏసుబాయిగా మెప్పించ బోతుంది. ఏది ఏమైనా కన్నడ భామలు హిందీ రాజ్యాన్ని ఏలుతుండటం గొప్ప విషయమే.

Tags

Next Story