G.O.A.T Breaks Records : ది గోట్ మూవీ రికార్డ్

G.O.A.T Breaks Records : ది గోట్ మూవీ రికార్డ్
X

కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ నటించిన 68 మూవీ ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరీ ఫీమేల్ లీడ్ చేసింది. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈమూవీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ది గోట్ 2024లో అత్యధిక గ్రాసర్ సాధించిన తమిళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన అన్ని ఏరియాల్లో ఇదే ట్రెండ్ ఉండటం విశేషం. నాలుగు వారాల ఓటీటీ అగ్రిమెంట్ తో ప్రపంచవ్యాప్తంగా రూ. 460 కోట్లు గ్రాస్ సాధించి అరుదైన రికార్డు సాధించింది. కాగా ఈమూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, మిక్ మోహన్, జయరాం కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. విజయ్‌ క్రేజ్‌ ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కించగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందించాడు.

Tags

Next Story