Actress Mahalakshmi Srinivasan : గుర్తుపట్టనంతగా మారిపోయిన అలనాటి హీరోయిన్

‘ఆదిత్య 369’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన మోహిని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్. ఈ హీరోయిన్ ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడిన మోహిని మత ప్రచారకురాలిగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో డిటెక్టివ్ నారద, హిట్లర్‌తో పాటు ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించారు. కాగా ఆమె నటించిన ‘ఆదిత్య 369’ ఎల్లుండి రీరిలీజ్ కానుంది.
2011లో మోహిని చివరి సారి వెండి తెరపై కనిపించింది. అప్పటి నుంచి సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మోహిన అమెరికాలో సెటిల్ అయ్యారు. సినిమాల్లో నటించిన సమయంలో సన్నగా నాజూకుగా కనిపించిన మోహిని ఆ తర్వాత కాస్త బరువు పెరిగారు. అయితే ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని, అప్పుడు ఎలా అందంగా ఉండేవారో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం అమెరికాలో మత ప్రచారకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీతో ఈమె ఉన్న ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్భంగా ఈమె గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com