The Paradise : హైదరాబాద్ నేపథ్యంలో ది ప్యారడైజ్

The Paradise : హైదరాబాద్ నేపథ్యంలో ది ప్యారడైజ్
X

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్', శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. 'దసరా' సినిమా తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. వచ్చే ఏడాది మార్చి 26న అంటే సరిగ్గా 365 రోజుల తర్వాత 'ది ప్యారడైజ్' ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. హైదరాబాద్ హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, స్వానిష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల చేస్తారు.

Tags

Next Story