Trisha : జోరు తగ్గలేదు.. త్రిష బిజీ

Trisha : జోరు తగ్గలేదు.. త్రిష బిజీ
X

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు గడిచినా త్రిష కృష్ణన్ జోరు తగ్గలేదు. అందం,అభినయంతో తన క్రేజ్ ను అలా మెయింటేన్ చేస్తోందీ భామ.ప్రస్తుతం కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం 'థగ్ లైఫ్' చిత్రంలో బిజీగా ఉంది. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా స్థాయి చిత్రం షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిషతో ఓ పాట సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నట్లు ఇన్స్టా వేదికగా చిత్రబృందం వెల్లడించింది. ఇందులో శింబు, జోజు జార్జ్, నాజర్, గౌతమ్ కార్తిక్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోపాటు త్రిష చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Tags

Next Story