Rebalstar Prabhas : ఫౌజీ సెట్ లోకి ప్రభాస్

Rebalstar Prabhas  :  ఫౌజీ సెట్ లోకి ప్రభాస్
X

రెబల్ స్టార్ ప్రభాస్ నాన్ స్టాప్ మూవీస్ తో కనిపిస్తున్నాడు. కాకపోతే షూటింగ్స్ బాగా ఆలస్యం అవుతున్నాయి. కొన్నాళ్లుగా అతను సమ్మర్ వెకేష్ కోసం వెళ్లాడు. దీంతో అన్ని షూటింగ్స్ వాయిదా పడిపోయాయి. ప్రస్తుతం రాజా సాబ్ చివరి దశలో ఉంది. అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఫౌజీ షూటింగ్ కూడా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ఉంటుంది. లేదా దానికంటే ముందే ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కూడా ఉండే అవకాశాలున్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే ముందు ప్రభాస్ వెకేషన్ నుంచి రావాలి. అందుకే ఈ న్యూస్.

ప్రభాస్ వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు వస్తున్నాడు. అందుకే రేపటి(మంగళవారం) నుంచి ఫౌజీ షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరగబోతోంది. ఇది ఓ లాంగ్ షెడ్యూల్ అని టాక్. దాదాపు నెల రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరిస్తారట. ఈ నెల రోజుల్లో సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ లో మెయిన్ కాస్టింగ్ అంతా పాల్గొనబోతోంది. అయితే ప్రభాస్ మాత్రం ఈ నెల 26 నుంచి సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. అప్పటి వరకూ అతను లేని సీన్స్ ను షూట్ చేస్తారట. సో.. ప్రభాస్ ఈ 26 నుంచి నెల రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఫౌజీ తో బిజీగా ఉంటాడన్నమాట.

Tags

Next Story