Bhagavanthudu : హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ "భగవంతుడు" మూవీ టీజర్ రిలీజ్.

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర టీజర్ ను ఈ రోజు హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ - రవి పనస నాకు మంచి మిత్రుడు. ఒకప్పుడు నన్ను ప్రొడక్షన్ వద్దు అనేవాడు. ఇప్పుడు తనే సినిమా చేస్తున్నాడు. బిజినెస్ మ్యాన్ గా రవి పనస సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గా కూడా మంచి హిట్ అందుకోవాలి కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు క్రిష్ మాట్లాడుతూ - "భగవంతుడు" సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. మూవీలో నా మేకోవర్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ దగ్గర నుంచి చూశాం. సినిమా పెద్ద హిట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకునే మూవీగా నిలుస్తుంది. అన్నారు.
నటుడు జబర్దస్త్ అభి మాట్లాడుతూ - "భగవంతుడు" మూవీ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నా కెరీర్ లో చేసిన ఒక డిఫరెంట్ మూవీ ఇది. టీజర్ లో నన్ను చూసి కొందరు గుర్తుపట్టకపోవచ్చు. మనం కాంతార మూవీ గురించి మాట్లాడుకుంటాం. అలాగే "భగవంతుడు" రిలీజ్ అయ్యాక ఈ సినిమా గురించి కూడా అలాగే అందరు గొప్పగా మాట్లాడుకుంటారు. అన్నారు.
నటుడు రవీందర్ విజయ్ మాట్లాడుతూ - వేణు ఊడుగుల అన్న నన్ను ప్రోత్సహిస్తుంటారు. మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లే ఈ మూవీలో మంచి రోల్ ఇప్పించారు. భగవంతుడు సినిమా సక్సెస్ మీట్ లో ఈ సినిమా గురించి మాట్లాడాలని ఉంది. అన్నారు.
నటుడు మైమ్ మధు మాట్లాడుతూ - "భగవంతుడు" నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ చిత్రంలో క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన విధానం, డైరెక్టర్ పర్ ఫార్మెన్స్ చేయించిన తీరు సూపర్బ్ గా ఉంటుంది. మేము చెప్పడం కాదు సినిమా చూశాక మీరంతా ఇదే మాట అంటారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ గోపి విహారి, ప్రొడ్యూసర్ రవి గారికి థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కేపీ మాట్లాడుతూ - "భగవంతుడు" సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కావడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గోపి విహారి గారికి, నిర్మాత రవి పనస గారికి థ్యాంక్స్. సాంగ్స్, బీజీఎం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మీరంతా మా "భగవంతుడు" సినిమాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - రవి పనస నాకు 2005 నుంచి తెలుసు. మేమిద్దరం ఒకేసారి ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేశాం. మాతో పాటు ఎన్నో మూవీస్ కు వర్క్ చేశారు రవి పనస. ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానంటే నేనే ప్రొడక్షన్ రిస్క్ వద్దు అని చెప్పేవాడిని. 20 ఏళ్ల తర్వాత ఆయన కల నెరవేరుతుండటం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో ఒక మంచి కథ దొరికి, ప్రాజెక్ట్ సెట్ కావడం అరుదు. నేను "భగవంతుడు" సినిమా చూశాను కాబట్టి చెబుతున్నా, ఇలాంటి సినిమా కుదరటం రవి పనస అదృష్టం. మా మధుర ఆడియో ద్వారా ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాం. తిరువీర్ లైనప్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మంచి మూవీస్ చేస్తున్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గా, రైటర్ గా గోపి విహారికి గుర్తింపు దక్కుతుంది. "భగవంతుడు" సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ - డైరెక్టర్ గోపి నాకు మంచి మిత్రులు. ఆయన నా విరాటపర్వం మూవీకి రైటర్ గా వర్క్ చేశారు. మీడియాలో పనిచేస్తున్న గోపిని ధైర్యంగా ఇండస్ట్రీకి రమ్మని నేనే ప్రోత్సహించాను. ఆయన దగ్గర ఉన్న రెండు మూడు కథలు విన్నాను. "భగవంతుడు" కథ నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది చెప్పాల్సిన స్టోరీ అనిపించింది. నాకు మంచి ఫ్రెండ్ రవి పనస అన్నతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కుదిర్చాను. తిరువీర్ నాకు ఇష్టమైన నటుడు. ఆయనకు కథ పంపగానే చదివి నేను చేస్తా అన్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గోపికి, మ్యూజిక్ డైరెక్టర్ కె.పి.కి మంచి పేరొస్తుంది. ఈ సినిమా నేను చూశా కాబట్టి చెబుతున్నా మీ అందరి ఆదరణతో ఘన విజయం సాధిస్తుంది. అన్నారు.
డైరెక్టర్ జి.జి. విహారి మాట్లాడుతూ - నేను సినిమా పాత్రికేయుడిగా కెరీర్ స్టార్ట్ చేశా. "భగవంతుడు" మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. నాతో ట్రావెల్ చేసిన నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. నేను ఈ సినిమా విషయంలో వేణు ఊడుగుల అన్నకు, రవి పనస అన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. చిన్నగా మొదలైన ఈ కథతో క్రమంగా చాలా బిగ్ మూవీ చేశాం. ఈ కథను తిరువీర్ కు నెరేట్ చేసినప్పుడు ఫస్టాఫ్ విని సెకండాఫ్ నీకు నచ్చితే చెప్పు లేకుంటే లేదు అన్నారు ఆయనకు అంత బాగా స్టోరీ మీద నమ్మకం కుదిరింది. ఫరియా అబ్దుల్లా గారి నెంబర్ తీసుకుని స్క్రిప్ట్ ఆమెకు మెసేజ్ చేశా. వెంటనే ఆఫీస్ కు వచ్చారు. అలా ప్రతి ఒక్కటీ ఈ మూవీకి కుదిరాయి. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన చుట్టూ ఉన్న, సమాజం ఉన్న వైరుధ్యాలు తెలుసుకునేందుకు కథలు చెబుతాం. ఈ అవగాహనతో నేను రూపొందించిన చిత్రమిది. తిరువీర్, రిషి, ఫరియా అబ్దుల్లా ..ఈ ముగ్గురూ సినిమాకు ఫిల్లర్స్ లా ఉన్నారు. పల్నాడు యుద్ధాన్ని తెలుగు మహాభారతం అంటారు. మన రూట్స్ అన్నీ పల్నాడులోనే ఉన్నాయి. తెలుగు వారు మర్చిపోయిన వైరుధ్యాలు పల్నాడులోనే పుట్టాయి. ఇప్పటికీ అక్కడ కత్తుల్ని దైవాలుగా కొలుస్తారు. వెయ్యేళ్ల కిందటే మన సమాజంలోని అంతరాలకు సమాధానం పల్నాడులో చెప్పడం జరిగింది. అందుకే ఈ సినిమాకు పల్నాడు బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. అన్నారు.
నటుడు రిషి మాట్లాడుతూ - సైతాన్ వెబ్ సిరీస్ తర్వాత నేను తెలుగు చేస్తున్న చిత్రమిది. ఈ కథను డైరెక్టర్ గోపి విహారి గారు చెప్పినప్పుడు ఇందులోని సారాంశం అర్థమైంది. సమాజంలోని గొంతు విప్పలేని వాళ్లకు గొంతుకగా నిలవాలి. ఆ ప్రయత్నమే ఈ మూవీ. ఇలాంటి సినిమాలో తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నా. గోపి విహారి గారి షార్ట్ డివిజన్, మేకింగ్ అన్నీ ఆకట్టుకుంటాయి. రవి పనస ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాకు ఏం కావాలో అన్నీ ఇచ్చారు. బడ్జెట్ పెరిగినా రాజీ పడలేదు. ఈ టీమ్ తో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. "భగవంతుడు" సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - "భగవంతుడు" సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ సినిమా చేయాలి ఫిక్స్ అయ్యాను. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు గోపి విహారి గారికి థ్యాంక్స్. రవి పనస గారు ఎంతో పట్టుదలగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జాతిరత్నాలు తర్వాత అలాంటి హ్యూమర్ ఉన్న మూవీస్ చేస్తున్నారు, కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నారా అని నన్ను అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సమాధానంగా "భగవంతుడు" సినిమా నిలుస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ రవి పనస మాట్లాడుతూ - సినిమా పరిశ్రమతో నాకు మంచి అనుబంధం ఉంది. కొంతకాలం బిజినెస్ లోకి వెళ్లినా, నా మనసు సినిమాల మీదే ఉండేది. ఒక మంచి మూవీ చేయాలని అనుకునేవాడిని. అలాంటి టైమ్ లో వేణు ఊడుగుల అన్న ఈ కథ గురించి చెప్పారు. డైరెక్టర్ గోపి విహారి "భగవంతుడు" కథ చెప్పినప్పుడు అసురన్, కాంతార, కర్ణన్, జైభీమ్ వంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఇలాంటి కథకు స్టార్ హీరోల కంటే కొత్త వాళ్లు కావాలి, స్టేజ్ ఎక్సిపీరియన్స్ ఉండాలని తిరువీర్, ఫరియాను తీసుకున్నాం. సైతాన్ వెబ్ సిరీస్ చూశాక రిషి మా మూవీకి బాగుంటాడని అనుకున్నాం. మేము అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువైనా మూవీ బాగా వచ్చింది. మేము చెప్పడం కాదు సినిమా చూసి ఏ స్థాయి సక్సెస్ అనేది ఆడియెన్స్ చెబుతారు. ఏప్రిల్ లో "భగవంతుడు"మూవీని రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాం. నన్ను ఒక బ్రదర్ లా సపోర్ట్ చేస్తున్న సునీల్ నారంగ్ అన్నకు థ్యాంక్స్. అన్నారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ - ది ప్రీ వెడ్డింగ్ షో సినిమా తర్వాత మళ్లీ మీ అందరినీ కలవడం హ్యాపీగా ఉంది. ఒకరోజు వేణు ఊడుగుల గారు కాల్ చేసి మంచి స్టోరీ ఉంది విను అని పంపారు. ఆ కథ విన్న 5 నిమిషాలకే ఎంత గొప్ప మూవీ అవుతుంది అనేది అర్థమైంది. నాకు ఇక స్క్రిప్ట్ చెప్పడం వద్ద షూటింగ్ ఎప్పుడు చెప్పండి అన్నాను. అప్పటికి మసూద రిలీజైంది. ఆ మూవీ హిట్ అయినా తిరువీర్ మీద ఎంత పెట్టొచ్చు, ఎంత వస్తుందని అంతా మాట్లాడుకుంటున్నారు. "భగవంతుడు" కథకు చాలా బడ్జెట్ అవుతుంది నా మీద అంత బడ్జెట్ పెడతారా అనే సందేహం ఉండేది. నటుడిగా నువ్వు ఈ కథకు కావాలని చూస్తున్నామని వేణు అన్న, డైరెక్టర్ గోపి విహారి గారు నాతో చెప్పారు. నాకు డ్యాన్స్ రాదు గోవింద్ గారు డ్యాన్స్ నేర్పించారు. అలాగే మహేశ్ మాస్టర్ డబ్బు కొట్టడం నేర్పారు. ఈ సినిమాలో మేమంతా ఒకరితో ఒకరం పోటీ పడి నటించాం. నన్ను నమ్మండి "భగవంతుడు" చాలా గొప్ప సినిమా అవుతుంది. అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - నేను స్నేహగీతం సినిమా చేస్తున్న టైమ్ నుంచి రవి పనస మంచి మిత్రులు. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండేవారు. ఆయన "భగవంతుడు" సినిమా నిర్మిస్తుండటం గర్వంగా ఉంది. ఏషియన్ సునీల్ గారితో కలిసి పక్కా ప్లానింగ్ తో రవి పనస అన్న ఈ మూవీ నిర్మిస్తున్నారు. టీజర్ చాలా బాగుంది. ఇంత బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. తిరువవీర్ నటనను ఇష్టపడతాను. ఆయన మసూద సినిమాను అనేక సార్లు చూశా. ఫరియా నాతో సిగ్మా అనే మూవీలో నటిస్తోంది. ఆమె మంచి కోస్టార్. డైరెక్టర్ విహారి గారికి కంగ్రాట్స్. అలాగే రాజ్ తోట మా ఊరు పేరు భైరవ కోన సినిమాకు వర్క్ చేశాడు. ఇప్పుడు స్పిరిట్ మూవీకి పనిచేస్తున్నారు. "భగవంతుడు" సినిమా ఘన విజయం సాధించాలని టీమ్ అందరికీ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ - నేను ఇండస్ట్రీకి రాకముందు ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లో హీరోల పక్కన రవి పనస అన్న కనిపించేవారు. సినిమా అవకాశాల కోసం ఫిలింనగర్ వచ్చి ఆయనను కలిసివాడిని. "భగవంతుడు" సినిమా టీజర్ ఈవెంట్ గురించి చెప్పగానే నేను తప్పకుండా వస్తానని వచ్చాను. ఈ రోజు ఈ నగరానికి ఏమైంది 2 షూటింగ్ జరుగుతోంది. అక్కడి నుంచే వచ్చాను. అలాగే హీరో తిరువీర్ నాకు మంచి మిత్రుడు. అన్నీ కుదిరితే ఫలక్ నుమా దాస్ సినిమాలో తిరువీర్ నటించేవాడు. టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ కు ఆల్ ది బెస్ట్. నేను అర్బన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తుంటా గానీ నాకు ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. "భగవంతుడు" మూవీ రవి పనస అన్నకు మంచి రిటర్న్స్ తీసుకొచ్చి..నాతో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.
Tags
- Bhagavantudu movie
- Bhagavantudu teaser
- Bhagavantudu teaser launch
- Thiruveer movie
- Faria Abdullah movie
- Rishi actor Telugu
- Gopi Vihari director
- Ravi Panasa producer
- Asian Films
- Narayan Das Narang
- Telugu movie teaser launch
- Telugu film events
- Telugu movie news
- Upcoming Telugu movies 2026
- Political action drama Telugu
- Romantic period movie Telugu
- Palnadu backdrop movie
- Bhagavantudu movie event
- Vishwak Sen speech
- Sandeep Kishan speech
- Telugu cinema updates
- Latest Telugu film news
- Telugu industry buzz
- Latest Telugu News
- TV5 News
- TV5 Entertainment
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
