Sumathi Shatakam : అంగరంగ వైభవంగా "సుమతీ శతకం" చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించగా నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు గారి చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిధి ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ విప్ జివి ఆంజనేయులు గారు మాట్లాడుతూ... "చిత్ర బృందం అందరికీ మంచి సినిమా తీసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ అభినందనలు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీజర్ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అర్థం అవుతుంది. భవిష్యత్ లో మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికి అభినందనలు" అన్నారు.
అతిధి నిర్మాత, నటుడు అశోక్ కొల్ల మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. శ్రీధర్ గారు నాకు ఎంతోకాలం నుండి తెలుసు. ఈ చిత్ర టీజర్ చాలా బావుంది. ఇప్పుడు చిన్న సినిమాలు వచ్చి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాగే పెద్ద విజయం సాధిస్తుంది అని అర్థం అవుతుంది. ఎంతో తపన ఉన్న నిర్మాత కాబట్టి మరెన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
అతిధి కంటమనేని శివ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. చిత్ర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
అతిధి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... "నాకు బాగా కావలసిన వ్యక్తులు ఈ చిత్ర నిర్మాతలు. ఈ సినిమా టీజర్ చూస్తే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయాలు అందుకుంటున్న వరుసలో ఈ సినిమా ఉంటుంది" అన్నారు.
అతిధి నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నిర్మాత సాయి కొమ్మాలపాటి అని సాయి గారిని పిలవడానికి నేను ఆనందంగా ఫీల్ అవుతాను. సుమతీ శతకం చిత్ర టీజర్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. హీరో అమరదీప్, హీరోయిన్ శైలి, దర్శకుడు నాయుడు గారికి ఆల్ ది బెస్ట్. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ... "సుమతీ శతకం చిత్ర టీజర్ రిలీజ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా అమరదీప్ కు మంచి మైలేజ్ తీసుకొస్తుంది అని కోరుకుంటున్నాను. హీరోయిన్ కు మంచి పేరు రావాలని, దర్శకునికి ఈ సినిమా ద్వారా మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సరదాగా మొదలైన ఈ సినిమా ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలిగించకుండా మంచి సందేశాత్మక చిత్రం సుమతి శతకం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... "ఈ చిత్ర కుటుంబంలో నేను ఒకడికి కావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో పాటలు చాలా బావుంటాయి. సంగీతం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు 10 సంవత్సరాల ప్రయాణం. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని కోరుకుంటున్నాను" అన్నారు.
యశ్ని గౌడ మాట్లాడుతూ... "చిత్ర బృందం అందరికీ కృతజ్ఞతలు. చిత్ర టీజర్ అందరికీ బాగా నచ్చింది అని అర్థం అవుతుంది. సినిమాను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.
నటుడు అర్జున్ అంబటి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చి అందరికి థాంక్స్. దర్శకుడు చాల కష్టపడి సినిమాను తీశారు. నిర్మాతలకు నా స్నేహితుడు అమర్దీప్ ను నమ్మి సినిమాను తెరకెక్కించినందుకు థాంక్స్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్ " అన్నారు.
నిర్మాత సుధాకర్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కథ దర్శకుడు మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు కుటుంబంతో కలిసి ఎంటర్టైన్ అయ్యే విధంగా అనిపించింది. అమర్దీప్ ప్రేక్షకులు ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. అలాగే సరదాగా, ఆక్టివ్ గా ఉంటాడు. ఈ తరం రవితేజ గారిలా అనిపిస్తాడు, అందుకే ఈ చిత్రం అమర్ బాగా చేయగలడు అనిపించింది. హీరోయిన్ కోసం ఒక చక్కటి తెలుగుతనం ఉన్న అమ్మాయి కావాలని శైలి గారిని తీసుకున్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ చాలా బాగా పని చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన సుమతీ శతకం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి తెలుగుతనం ఉన్న టైటిల్. సినిమా మంచి విజయం సాయించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. టీజర్ లాంచ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా నాకు తొలి చిత్రం. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, నాతో నటించిన అమర్దీప్, అలాగే ఇతర నటీనటులకు ధన్యవాదాలు. మీడియా వారికి, ప్రేక్షకులకు థాంక్స్. చిత్ర టీజర్ అందరికీ నచ్చిందని అవుతుంది. మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా నన్ను నమ్మి సినిమాను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత గారికి, నా దర్శక బృందానికి థాంక్స్. సినిమాలో నటించిన అమర్దీప్ గారికి, ఇతర నటీనటులకు నన్ను నమ్మినందుకు థాంక్స్. సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అందించారు. సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఎంతో కష్టపడి మంచి విజువల్స్ అందించారు. పాటలు రాసిన లిరిసిస్ట్ లు బాగా సపోర్ట్ చేశారు. సినిమా మంచి విజయం సాధించేందుకు ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.
హీరో అమర్దీప్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు సినిమాలో అవకాశం ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా ప్రేక్షకులను పూర్తిగా వినోదపరుస్తుంది. సినిమాలోని పాటలు, సంగీతం అద్భుతంగా ఉండబోతుంది. సినిమాటోగ్రాఫర్ సినిమా కోసం పెట్టిన కష్టం వెండి తెరపై కనిపిస్తుంది. అలాగే మంచి డాన్స్ స్టెప్స్ ఉంటాయి. సినిమాలో చాలా మంచి విషయం ఉంటుంది. సినిమాలో కొంచెం రవితేజ గారిని రిఫర్ చేసుకుంటు కొన్ని ఉంటాయి. శైలి సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఇతర నటీనటులు అంతా కష్టపడి సినిమాకు సపోర్ట్ చేశారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.
నటీనటులు : అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు.
Tags
- Sumathi Satakam movie
- Sumathi Satakam teaser launch
- Sumathi Satakam Telugu film
- Vision Movie Makers
- Sai Sudhakar Kommalapati producer
- MM Naidu director
- Amardeep Chowdary hero
- Shaili Chowdary heroine
- Telugu new movies 2025
- Sumathi Satakam teaser
- GV Anjaneyulu Chief Whip
- Telugu movie teaser launch
- February 6 Telugu movie release
- Subhash Anand music
- Telugu family entertainer
- Telugu message oriented movie
- Sumathi Satakam film cast
- latest Telugu cinema news
- Latest Telugu News
- TV5 News
- TV5 Entertainment
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

