Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

Mohan Babu :   మోహన్ బాబు ఇంట్లో దొంగతనం
X

సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రస్తుతం శంషాబాద్ లో నివాసం ఉంటున్నాడు మోహన్ బాబు. ఆయన ఇంట్లో పనిచేస్తోన్న నాయక్ అనే వ్యక్తి 10 లక్షలు తీసుకుని పారిపోయాడని రాచకొండ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నాయక్ ను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీస్ లు. అయితే అతను ఎంత కాలంగా ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు.. అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మోహన్ బాబు సన్నిహితులు ఆరా తీస్తున్నారు.

ఇక సినిమాలకు వస్తే మోహన్ బాబు కొంత కాలంగా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు. హీరోగా చేసే ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. కీలక పాత్రల కోసం అడుగుతున్నా.. అక్కడా సెలెక్టెడ్ గానే కనిపిస్తున్నారు. అలాంటి సీనియర్ నటుల అవసరం టాలీవుడ్ కు చాలానే ఉంది. అయినా ఆయనెందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఇప్పుడు తన కొడుకు మంచు విష్ణు నిర్మిస్తూ హీరోగా నటిస్తోన్న కన్నప్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేశాడు. ఈ డిసెంబర్ లోనే కన్నప్ప విడుదలవుతుందంటున్నారు. కన్నప్పలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి టాప్ యాక్టర్స్ కూడా ఉన్నారు.

మొత్తంగా తన ఇంట్లో దొంగతనం చేసిన నాయక్ త్వరలోనే దొరకాలని కోరుకుందాం.

Tags

Next Story