Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'సలార్' గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చివరి చిత్రం 'రాధే శ్యా్మ్' తన అభిమానులు అందరినీ ఆకట్టుకోలేకపోయింది. అందుకే తన అప్‌కమింగ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'సలార్'లాంటి చిత్రంలో ప్రభాస్ నటించి చాలాకాలం అవుతుండడంతో దీనిపై ప్రేక్షకులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాజాగా ఈ మూవీ నుండి ఓ క్రేజీ అప్డేట్‌ను అందించాడు దర్శకుడు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలను హ్యాండిల్ చేస్తున్నాడు. అందులో ఒకటి ప్రభాస్‌తో చేస్తున్న సలార్ కాగా మరొకటి 'కేజీఎఫ్ 2'. ఇప్పటికే యశ్‌తో తెరకెక్కించిన కేజీఎఫ్ 2 బుధవారం విడుదలకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. అప్పుడప్పుడు సలార్ గురించి విశేషాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు.
సలార్ షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటికీ ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. అందులో ఒకటి సలార్ కూడా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అన్నది. అయితే అలాంటిది ఏమీ లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ అప్డేట్స్ గురించి అడగగా.. మే లో గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిపాడు ఈ దర్శకుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com