Raja Saab Movie : ఈ సంక్రాంతికి భారీ పోటీ ఉందిగా

సంక్రాంతి అంటే భారీ చిత్రాలు పోటీ ఉంటాయి. కాకపోతే కొన్నాళ్లుగా ఈ పోటీని తప్పించారు. పెద్ద సినిమాల మధ్య పోటీ తగ్గించారు. లేదంటే ఒకరికి మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. అయినా బిగ్ స్టార్స్ మధ్య వార్ లోకి దిగడం చూస్తున్నాం. బట్ ఈ సంక్రాంతి మాత్రం బరిలోకి భారీగా చిత్రాలు దిగుతున్నాయి. గ్యాప్ ఉంటే చాలు మనాళ్లు మాత్రం పెద్ద సినిమాలు గిరి గీసుకుని ఉంటున్నాయి. మరి ఈ పోటీ ఉంటే ఎలా ఉండబోతోంది..? ఎలాంటి భారీ చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి అనేది మాత్రం చూస్తే..
జనవరి 9నుంచి దందా మొదలవుతోంది. సంక్రాంతి శెలవులు స్టార్ట్ అవుతాయి అనడం చాలు.. సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ మాత్రం 9నే రిలీజ్ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ హారర్ మూవీ చేయడం ఫస్ట్ టైమ్.. ఈ మేరకు అతని టీజర్ తోనే హైలెట్ చేయడం.. ముగ్గురు హీరోయిన్లు.. సంజయ్ దత్ వెరైటీ రోల్ చేయడం చూడటం బావుంది. మరి ఈ మూవీ జనవరి 9న విడుదలకు సిద్ధం అవుతోంది. సంక్రాంతి వార్ మొదలవుతోందన్నమాట.
ఇక అదే రోజు తమిళనాడులో విడుదలువుతోంది సినిమా జన నాయగన్. తెలుగులోనూ జన నాయకుడు అనే టైటిల్ తో విడుదలవుతోంది. ఈ చిత్రం విజయ్ హీరోగా నటించే చిత్రం చివరి సినిమా అనే ట్యాగ్ తో వస్తోంది. అతను పొలిటికల్ ఎంట్రీ ఇస్తోన్న మూవీ కూడా భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా వస్తోన్న జన నాయకుడు జనవరి 9నే పోటీగా విడుదలవుతోంది.
10 లేదా 12నే విడుదలవుతోన్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం విడుదలవుతోంది. చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తయింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న మూవీపై అంచనాలున్నాయి. ప్రతి యేడాది అతనో హిట్ మూవీ తీయడం మాత్రం పరిపాటవుతోంది. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేష్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ చేయడం కలిసొస్తుంది. మరి ఇంకా కరెక్ట్ డేట్ మాత్రం చెప్పడం లేదు కానీ సంక్రాంతి బరిలో విడుదలవుతోందీ మూవీ.
యాక్సిడెంట్ తర్వాత కోలుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో విజయాన్ని అందుకున్నాడు. ఆపై సితార బ్యానర్ లో మూవీ స్టార్ట్ అయింది. ఆ టైమ్ లో ప్రమాదం జరిగింది. సినిమా బాగా లేట్ అయింది. దీంతో ఆ లేట్ ను కవర్ చేయడానికి 2026 సంక్రాంతికి విడుదల అని అనగనగా ఒక రాజు అనే మూవీ గురించి చెప్పాడు. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని కూడా సంక్రాంతికి విడుదల అని తేల్చి చెబుతున్నారు.
శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారీ కూడా సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కూడా రిలీజ్ లేట్ అవుతోంది అనే టాక్ ఉంది. ఆ లేట్ కారణంగానే సంక్రాంతికి విడుదల అని చెబుతున్నారు. మరి నిజంగా ఈ మూవీ విడుదలవుతుందీ అనేది చూడాలి.
ఇక రవితేజ సంక్రాంతికి అని పోస్టర్లు వేయడం ఆగిపోవడం మాత్రం కామన్ గా చూస్తున్నాం. 2024, 2025 టైమ్ లోనే అలా జరిగింది. ఇక ఈ సారి కూడా అడే డేట్ తో విడుదల డేట్ వదిలాడు. సినిమా పేరు భర్త మహాశయులకు విజ్ఞప్తి. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గానే రవితేజ గ్లింప్స్ కూడా విడుదల చేశాడు. అప్పుడే అతను సంక్రాంతికి విడుదల అని చెప్పడం. ఈ మూవీ నిజంగా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.
మొత్తంగా ఇంకా కొన్ని చిన్నా చితకా సినిమాలు కూడా విడదలవుతుండటం వల్ల సంక్రాంతికి గట్టి ప్యాక్ అవుతోంది. మరి ఈ సారి అన్ని సినిమాలను సంక్రాంతి ఎలా భరిస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

