Mad Square : మ్యాడ్ సీక్వెల్ విశేషాలు ఇవే

Mad Square : మ్యాడ్ సీక్వెల్ విశేషాలు ఇవే
X

విజయవంతమైన 'మ్యాడ్' సినిమాకు సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్' రూపొందుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే లా 'మ్యాడ్ స్క్వేర్' నుంచి టీజర్ విడుదలైంది. ఈ వేసవికి 'మ్యాడ్ స్క్వేర్', ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది.

మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక కామెడీ సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్ 'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్ లు నవ్విస్తున్నాయి.

'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శామత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags

Next Story