Vikram New Film : విక్రమ్ కొత్త సినిమా విశేషాలు ఇవే

విక్రమ్ నటిస్తున్న యాక్షన్ చిత్రం 'వీర ధీర సూరన్ పార్ట్ 2'. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ ఉన్నారు. రియా శిబు నిర్మించిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' ప్రేక్షకులకు సస్పెన్స్ సినిమాగా ఆకట్టుకుంటుంది. మంగళవారం ఈ సినిమా నుండి "కళ్లల్లో... " పాటని విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని స్వరపరిచారు. శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ ఆలపించారు. రాజేష్ గోపిశెట్టి సాహిత్యం అందించారు. ఈ పాటలో విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ చాలా సహజంగా వుంది. ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com