2024 Top Ten Movies : ఈ యేడాది టాప్ 10 మూవీస్ ఇవే..

2024 Top Ten Movies :  ఈ యేడాది టాప్ 10 మూవీస్ ఇవే..
X

2024 ఎండింగ్ కు వచ్చేశాం. ఈ యేడాది టాలీవుడ్ కు ఆశించినంత గొప్పగా అయితే లేదు. అలాగని మరీ చప్పగా కూడా లేదు. కొన్ని అంచనాలను అందుకోలేకపోయాయి. మరికొన్ని అంచనాలను మించిపోయాయి. ఏవి ఎలా ఉన్నా.. కలెక్షన్స్ పరంగా పదికిపైగా సెంచరీలు నమోదయ్యాయి. మరి ఈ యేడాది టాప్ లేపిన పది సినిమాలేంటో చూద్దాం.

1. పుష్ప 2 - ది రూల్

కంటెంట్ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు కలెక్షన్లే ఫైనల్ అంటున్నారు కాబట్టి అలా చూస్తే పుష్ప 2 ది రూల్ టాప్ ప్లేస్ లోకి వస్తుందని చెప్పాలి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రష్మికమందన్నా, ఫహాద్ ఫాజిల్, కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి తెలుగు ప్రేక్షకుల కంటే నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇంకా చెబితే తెలుగులో కొన్ని చోట్ల ఫ్లాప్ అని కూడా చెప్పాలి. బట్ ఓవరాల్ కలెక్షన్స్ తో చూస్తే పుష్ప 2 ఇప్పటికే 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

2. కల్కి 2898ఏడి

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఈ యేడాది అతి పెద్ద సినిమాగా చెప్పాలి. అంటే ప్యాన్ ఇండియా టాప్ స్టార్ అయిన ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణ్ వంటి టాప్ యాక్టర్స్ ఉన్న మూవీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వైజయంతీ బ్యానర్లో రూపొందింది. కలెక్షన్స్ పరంగా కల్కి 1100 - 1200 కోట్ల వరకూ సాధించింది. నిజానికి బాహుబలి2ని క్రాస్ చేస్తుందని చాలామంది భావించారు. కానీ అక్కడి వరకూ వెళ్లలేకపోయింది. బట్ టాప్ టెన్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

3. దేవర 1

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూడవ స్థానంలో నిలిచింది. రాజమౌళితో మూవీ చేసిన తర్వాత ఏ మూవీ చేసినా ఫ్లాప్ అన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసిందీ మూవీ. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొరటాల శివపై ఉన్న అనుమానాలను కూడా తుడిచేసింది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అయింది. అనిరుధ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచిన దేవర 450 -500 కోట్ల వరకూ వసూళ్లు సాధించి భారీ విజయం సాధించిన మూవీగా 3వ స్థానంలో నిలిచింది.

4. హను మాన్

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ టైమ్ లోనే అనేక కాంట్రవర్శీలు వచ్చాయి. అన్నీ దాటుకుని అదే డేట్ కు విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అస్సలెవరూ ఊహించని కంటెంట్ తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో ప్రశాంత్ వర్మ చేసిన మ్యాజిక్ కు ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అందుకే ఈ చిత్రానికి ఏకంగా 300 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. ఆ వసూళ్లతోనే 2024 టాప్ టెన్ లో 4వ స్థానం సంపాదించుకుంది.

5. గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది. అంతకు ముందు వచ్చిన అతడు, ఖలేజాల్లాగా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుందీ మూవీ. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేసింది. రిలీజ్ టైమ్ లో మిక్స్ డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా సత్తా చాటింది. ఓవరాల్ గా 250 కోట్ల వరకూ వసూళ్లు సాధించి అదరగొట్టింది గుంటూరు కారం. అందుకే 5వ స్థానం.

6. టిల్లు స్క్వేర్

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ కి బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన టిల్లు స్క్వేర్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. గతేడాది వచ్చిన డిజే టిల్లుకు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వాటిని దాటుకుని మరీ దుమ్మురేపింది. చిన్న సినిమాగానే రూపొందిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 135 కోట్ల వసూళ్లు సాధించి వారెవ్వా అనిపించుకుంది.

7. లక్కీ భాస్కర్

దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన మూడో సినిమా లక్కీ భాస్కర్. అంతకు ముందు అతను నటించిన మహానటి, సీతారామం బ్లాక్ బస్టర్స్ కావడంతో ఆ రెండు సినిమాల ద్వారా అతనికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా బలమైన కథలు ఉంటేనే కమిట్ అయ్యే దుల్కర్.. సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేసిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ సెక్టర్ లోని లూప్ హోల్స్ ను వాడుకుంటూ ఓ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయి వందల కోట్లు ఎలా సంపాదించాడు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం చాలామందికి నచ్చింది. మీనాక్షి చౌదరి నటన ఆకట్టుకుంది. లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద 106 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టింది.

8. సరిపోదా శనివారం - 100 కోట్లు

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా ఎస్.జే సూర్య విలన్ గా వివేక్ ఆత్రేయ రూపొందించి సరిపోదా శనివారం ఈ యేడాది సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ తర్వాత డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కనిపిస్తుంది. ఆవేశపరుడైన యువకుడు తన తల్లి కోరిక మేరకు తన ఆవేశాన్నంతా కేవలం శనివారం మాత్రమే చూపించే కంటెంట్ ప్రేక్షకులకు నచ్చింది. ఈ మధ్య మాస్ మూవీతో మెప్పిస్తోన్న నానికి సరిపోదా శనివారం మరింత బూస్టప్ ఇచ్చింది. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది.

9. క

ఇన్నాళ్లూ చిన్న హీరోగా, ట్రోల్స్ కూ గురవుతూ.. తనకంటూ ఓ పాథ్ క్రియేట్ చేసుకుంటోన్న కిరణ్ అబ్బవరం ఈ యేడాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. కంటెంట్ తోనే కాదు.. క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ కూడా హైలెట్ అయింది. తనను ట్రోల్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇవ్వడమే కాదు.. క మూవీ హిట్ అవకపోతే తను ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోతానని ఛాలెంజ్ కూడా చేశాడు. ఈ యేడాదే తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గోరఖ్ ను పెళ్లి కూడా చేసుకున్న కిరణ్.. క మూవీ కంటెంట్ తో బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు. తన కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించాడు. అంతకు మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అతి త్వరలోనే టైర్ 2 హీరో అయ్యే లక్షణాలున్నాయన్నారు చాలామంది. సుజిత్ - సందీప్ ద్వయం ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం అయ్యారు. క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందన్నారు చాలామంది. ఈ మూవీ 53 కోట్లు వసూళ్లు సాధించింది.

10. నా సామిరంగా

చివరి నిమిషంలో సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ అయిన సినిమా నా సామిరంగా. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథ్, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా పరిచయం అయ్యాడు విజయ్ బిన్ని. ఓ మళయాల మూవీ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నాగ్ మాత్రమే కాక నరేష్ పాత్రకూ గొప్ప అప్లాజ్ వచ్చింది. అలాగే అషికా రంగనాథ్ గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకున్న నా సామిరంగా 40 కోట్ల వసూళ్లు సాధించింది.

మొత్తంగా చాలా సినిమాలే వచ్చినా.. కాస్త ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన సినిమాలుగా వీటినే చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాకూ ఓ ప్రత్యేకత ఉంది. కథ, కథనాలతోనే కాక కలెక్షన్ల పరంగానూ మెప్పించాయి. పైగా ఒక్క క తప్ప మిగతా అన్ని పెద్ద స్టార్స్ నటించినవే. సో.. వీటితో మరికొన్ని మూవీస్ కూడా సత్తా చాటాయి.

Tags

Next Story