Taapsee : హీరోయిన్ లను కూడా వారే డిసైడ్ చేస్తారు : తాప్సీ

Taapsee : హీరోయిన్ లను కూడా వారే డిసైడ్ చేస్తారు : తాప్సీ
X

తన అందం, నటనతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. కానీ ఇక్కడ అనుకున్నంతగా ఈ భామ క్లిక్ అవలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడ ఆమెకు అవకాశాలు వస్తున్నా.. ఏ పాత్రలు స్టార్ ఇమేజ్ తీసుకురాలేకపోతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డంకీ మూవీలో చేస్తున్నప్పడు రెమ్యునరేషన్లో తేడాలపై ఆమె మాట్లాడారు. ఈ సందర్భంలో ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా హీరోల కంటే తక్కువగానే చెల్లిస్తారని తాప్సీ చెప్పుకొచ్చింది. “నేను డబ్బు కోసం జుడ్వా లేదా డంకీ వంటి సినిమాలు చేస్తానని, నాకు చాలా డబ్బు వస్తుందని ప్రజలు అనుకుంటారు” అని ఫన్నీగా చెప్పుకొచ్చింది. “కానీ ఇది విరుద్ధం – హసీన్ దిల్రూబా వంటి సినిమాలు చేయడానికి నాకు ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది. ఇతర సినిమాల్లో నాకు అంతగా ఫీజు చెల్లించలేదు. ఎందుకంటే అలాంటి చిత్రంలో నన్ను తీసుకోవడం ద్వారా వారు మంచి చేస్తున్నారని వారు భావిస్తారు, "అని పన్నూ వివరించారు. అయితే తమ సినిమాల్లో ఎలాంటి హీరోయిన్ను తీసుకోవాలో కూడా హీరోలే డిసైడ్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తాప్సీపన్నూ త్వరలోనే .. ప్రతీక్ గాంధీతో కలిసి వో లడ్కీ హై కహా సినిమాలో కనిపించనుంది.

Tags

Next Story