Pragya Jaiswal : డాకు మహారాణి అని అని పిలుస్తున్నారు : ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal : డాకు మహారాణి అని అని పిలుస్తున్నారు : ప్రగ్యా జైస్వాల్
X

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన చిత్రం డాకు మహరాజ్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా హిట్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కావేరి పాత్రలో మెప్పించింది ప్రగ్యా. బాలకృష్ణతోనే వరుస అవకాశాలు. ఈ అమ్మడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా కూడా హిట్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. డాకు మహరాజ్ హిట్ పై స్పందించింది. తన పుట్టిన రోజు నాడే 'డాకు మహారాజ్' విడుదలై విజయాన్ని అందుకుందంటోంది. ఈ ఏడాది తనకు అద్భుతంగా ప్రారంభమైందని చెప్పింది. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందంటోంది. 'డాకు మహారాజ్' విడుదలైన దగ్గర నుంచి తనను అందరూ 'డాకు మహారాణి' అని పిలుస్తున్నారని చెబుతోంది. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమంటోంది. గర్భిణి పాత్రలో నటించడం కొత్త అను భూతినిచ్చిందని చెప్పింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటం ప్రేక్షకుల మన సులను కదిలించిందని అంటోంది ప్రగ్యా.

Tags

Next Story